వర్షాకాలం చివరి దశలో ఉన్నా హైదరాబాద్ నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం గచ్చిబౌలిలో అత్యధికంగా 37.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ అధికంగా ఉండటంతో ‘ఫీల్స్ లైక్’ ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు అనిపించింది.
గురువారం నుంచి నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.
మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లేవారు నీరు ఎక్కువగా తాగాలని, వృద్ధులు, పిల్లలు ఎండలో ఎక్కువసేపు ఉండవద్దని వైద్యులు సూచిస్తున్నారు.