హైదరాబాద్‌లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ బిర్యానీ కేఫ్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో సుమారు 50 కిలోల కుళ్లిన మాంసం, గడువు ముగిసిన పదార్థాలు బయటపడ్డాయి. ఆ సంస్థ లైసెన్స్ సస్పెన్షన్‌కు అధికారులు సిఫారసు చేశారు.
మరోవైపు ఎల్‌బీ నగర్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన తొమ్మిది ఆహార సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను తెలంగాణ ఆహార భద్రతా విభాగం సస్పెండ్ చేసింది.
హోటళ్లలో పరిశుభ్రత లోపిస్తే ఫుడ్ సేఫ్టీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు వినియోగదారులకు సూచించారు.