హైదరాబాద్

సైబరాబాద్ పోలీసుల ఘనత: రూ.2.43 కోట్ల విలువైన 1,218 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ

సీఈఐఆర్ పోర్టల్ ఆధారంగా చేపట్టిన 11వ దశ డ్రైవ్‌లో సైబరాబాద్ పోలీసులు 1,218 మొబైల్ ఫోన్లను గుర్తించి యజమానులకు అప్పగించారు. వాటి విలువ సుమారు రూ.2.43 కోట్లు.

షేర్ చేయండిWhatsAppTelegram
సైబరాబాద్ పోలీసుల ఘనత: రూ.2.43 కోట్ల విలువైన 1,218 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ

పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్టే కార్యక్రమంలో సైబరాబాద్ పోలీసులు మరో మైలురాయి సాధించారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ సాయంతో చేపట్టిన 11వ దశ డ్రైవ్‌లో 1,218 ఫోన్లను రికవరీ చేశారు.

ఈ ఫోన్ల విలువ సుమారు రూ.2.43 కోట్లు. మూడు సీసీఎస్ యూనిట్లు వీటిని ట్రేస్ చేసి యజమానులకు అప్పగించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లు రికవరీ అయ్యాయి.

ఫోన్ పోయిన వెంటనే ceir.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని, ఐఎంఈఐ నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.