హైదరాబాద్

నిమజ్జనం కోసం 24 గంటలూ 700 ప్రత్యేక బస్సులు.. 44 కీలక ప్రాంతాల్లో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది

గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో టీజీఎస్ఆర్టీసీ 700 ప్రత్యేక బస్సులను 24 గంటలూ నడపనుంది. 44 కీలక ప్రాంతాల్లో సిబ్బంది, రిలీఫ్ వాహనాలను మోహరించారు.

షేర్ చేయండిWhatsAppTelegram
నిమజ్జనం కోసం 24 గంటలూ 700 ప్రత్యేక బస్సులు.. 44 కీలక ప్రాంతాల్లో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది

గణేశ్ నిమజ్జన రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరవ్యాప్తంగా సుమారు 700 ప్రత్యేక బస్సులను 24 గంటలూ నడుపుతోంది.

44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బందిని, రిలీఫ్ వాహనాలను, మెకానిక్ బృందాలను మోహరించారు. బస్సు బ్రేక్‌డౌన్ అయితే వెంటనే ప్రత్యామ్నాయ వాహనం పంపేలా ఏర్పాట్లు చేశారు.

భక్తులు సొంత వాహనాలకు బదులు ఆర్టీసీ బస్సులను వినియోగించాలని, తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని సంస్థ కోరింది.