హైదరాబాద్ ఉప్పర్‌పల్లి పరిధిలో గురువారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. హ్యాపీ హోమ్స్ వద్ద జరిగిన వాగ్వాదం హత్యకు దారితీసింది.
వాసిం అనే యువకుడిని అతని ఇద్దరు స్నేహితులే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.