హైదరాబాద్

పరిశుభ్రత లోపాలతో 8 హోటళ్ల మూసివేత.. లైసెన్సులు సస్పెండ్ చేసిన ఆహార భద్రతా శాఖ

తీవ్ర పరిశుభ్రత లోపాలు బయటపడటంతో ఎనిమిది హోటళ్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేసి మూసివేయాలని టీజీ సేఫ్ ఆదేశించింది. లైసెన్స్ లేని మరో సంస్థను కూడా మూసివేశారు.

షేర్ చేయండిWhatsAppTelegram
పరిశుభ్రత లోపాలతో 8 హోటళ్ల మూసివేత.. లైసెన్సులు సస్పెండ్ చేసిన ఆహార భద్రతా శాఖ

హైదరాబాద్‌లో ఆహార భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. తీవ్రమైన పరిశుభ్రత లోపాలు బయటపడిన ఎనిమిది హోటళ్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను టీజీ సేఫ్ సస్పెండ్ చేసి వాటిని మూసివేయాలని ఆదేశించింది.

లైసెన్స్ లేకుండా నడుస్తున్న మరో సంస్థను కూడా మూసివేశారు. ఇతర హోటళ్లకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు.

వంటగదుల్లో పరిశుభ్రత లోపిస్తే ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్ ద్వారా ఫొటోలతో ఫిర్యాదు చేయాలని అధికారులు వినియోగదారులకు సూచించారు.