లైఫ్‌స్టైల్

హైదరాబాద్‌లో ఇండోనేషియా రుచులు.. సెప్టెంబర్ 25-27 వరకు ‘ఐల్యాండ్స్ ఆఫ్ స్పైస్’ ఫుడ్ ఫెస్టివల్

పార్క్ హయత్ హైదరాబాద్, పార్క్ హయత్ జకార్తాతో కలిసి సెప్టెంబర్ 25-27 వరకు ‘ఐల్యాండ్స్ ఆఫ్ స్పైస్’ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇండోనేషియా చెఫ్‌లు ప్రాంతీయ వంటకాలను పరిచయం చేయనున్నారు.

షేర్ చేయండిWhatsAppTelegram
హైదరాబాద్‌లో ఇండోనేషియా రుచులు.. సెప్టెంబర్ 25-27 వరకు ‘ఐల్యాండ్స్ ఆఫ్ స్పైస్’ ఫుడ్ ఫెస్టివల్

హైదరాబాద్ ఫుడ్ ప్రియులకు కొత్త రుచుల అనుభవం అందుబాటులోకి వచ్చింది. పార్క్ హయత్ హైదరాబాద్, పార్క్ హయత్ జకార్తాతో కలిసి ‘ఐల్యాండ్స్ ఆఫ్ స్పైస్’ పేరుతో ఇండోనేషియా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.

సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు జరిగే ఈ ఫెస్టివల్‌లో ఇండోనేషియా చెఫ్‌లు రెండు దేశాల రుచులను కలిపి ప్రత్యేక వంటకాలను అందిస్తారు. వైన్ డిన్నర్లు, లంచ్ బఫేలు ఉంటాయి.

నగరంలో అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్స్‌కు ఆదరణ పెరుగుతోందని హోటల్ రంగ ప్రతినిధులు చెబుతున్నారు.