హైదరాబాద్ మారథాన్ 15 ఏళ్ల ప్రయాణాన్ని ఫొటోల ద్వారా ఆవిష్కరించే ప్రదర్శన నగరంలో ప్రారంభమైంది. ‘బియాండ్ ద ఫినిష్ లైన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన రన్నర్ల కృషిని, నగర సంస్కృతిని చూపిస్తుంది.
గోథె-జెంట్రమ్ హైదరాబాద్‌లో అక్టోబర్ 5 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ప్రవేశం ఉచితం.
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2026 రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.