ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి. జనవరి నుంచి ఆగస్టు మధ్య రూ.846 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి.
ఈ కాలంలో 635 డ్రగ్స్ కేసులు నమోదు కాగా, 111 మంది విదేశీయులు సహా మొత్తం 930 మందిని అరెస్ట్ చేశారు. మాదకద్రవ్యాల కారణంగా 45 మంది మరణించారు.
మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉండటంతో ఈ రాష్ట్రం అక్రమ రవాణాకు మార్గంగా మారుతోంది.