జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పశ్చిమ బెంగాల్‌లో కీలక ఆపరేషన్ నిర్వహించింది. జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)తో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది.
వారి వద్ద నుంచి తీవ్రవాద భావజాల ప్రచార పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌క్రిప్టెడ్ సందేశాల ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని రిక్రూట్‌మెంట్ నెట్‌వర్క్ నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నెట్‌వర్క్ ప్రభావానికి గురైన యువకుల ఆచూకీని ఎన్ఐఏ గుర్తిస్తోంది.