హైదరాబాద్‌లో ఇటీవల వరుసగా హోటళ్లలో కుళ్లిన మాంసం, గడువు ముగిసిన పదార్థాలు పట్టుబడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులుగా మీరు ఏం చేయవచ్చు?
- ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ చూడండి: ప్రతి హోటల్ లైసెన్స్ నంబర్‌ను కౌంటర్ వద్ద ప్రదర్శించాలి. బిల్లుపైనా ఉండాలి.
- ఫొటో, వీడియో తీయండి: ఆహారం, వంటగది పరిస్థితిని ఆధారంగా రికార్డు చేయండి.
- ఫిర్యాదు చేయండి: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం యాప్ లేదా ఎఫ్ఎస్ఎస్ఏఐ ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్’ యాప్ ద్వారా ఫొటోలతో ఫిర్యాదు చేయవచ్చు.
- జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్: నగర పరిధిలో 040-21111111కు కూడా సమాచారం ఇవ్వొచ్చు.
- ఆరోగ్యం దెబ్బతింటే: వైద్య నివేదికతో వినియోగదారుల కమిషన్‌లో పరిహారం కోరవచ్చు.
ఫిర్యాదులపై 48 గంటల్లో తనిఖీ జరుగుతుందని ఆహార భద్రతా అధికారులు తెలిపారు.