జాతీయ వార్తలు

గాల్లో ఘోర ప్రమాదాన్ని తప్పించిన భారత పైలట్.. కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు ప్రశంసల వెల్లువ

ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో సహ పైలట్ దాడి చేసినా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యంగా విమానాన్ని కాపాడారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, ఇజ్రాయెల్ నేతలు ఆయన సాహసాన్ని కొనియాడారు.

షేర్ చేయండిWhatsAppTelegram
గాల్లో ఘోర ప్రమాదాన్ని తప్పించిన భారత పైలట్.. కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు ప్రశంసల వెల్లువ

ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో జరిగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సహ పైలట్ కత్తితో దాడి చేసినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తీవ్రంగా గాయపడుతూనే విమానాన్ని నియంత్రణలో ఉంచారు.

ఆయన సమయస్ఫూర్తి వల్ల సిబ్బంది జోక్యం చేసుకుని దాడిని అడ్డుకోగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడబడ్డాయి.

కెప్టెన్ మచ్ఛర్ ‘అసాధారణ ధైర్యాన్ని’ ప్రదర్శించారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రశంసించారు. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ఆయనను కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ సైతం ప్రశంసలు తెలిపారు.