బిహార్‌లో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. నేపాల్‌లోని గండక్ నదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.
పలు చోట్ల కట్టలు తెగిపోవడంతో గ్రామాలు నీట మునిగాయి. ఆరు జిల్లాల్లో సుమారు 2,03,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
సహాయక బృందాలు పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు ఏర్పాటు చేశారు.