హైదరాబాద్

సైబరాబాద్ పరిధిలో 1.03 లక్షల గణేశ్ విగ్రహాల నిమజ్జనం.. పూల వ్యర్థాల ప్రత్యేక సేకరణ

సైబరాబాద్ పరిధిలోని నిర్దేశిత ప్రదేశాల్లో ఇప్పటివరకు 1.03 లక్షలకు పైగా గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. పూల వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి ప్రాసెసింగ్‌కు తరలిస్తున్నారు.

షేర్ చేయండిWhatsAppTelegram
సైబరాబాద్ పరిధిలో 1.03 లక్షల గణేశ్ విగ్రహాల నిమజ్జనం.. పూల వ్యర్థాల ప్రత్యేక సేకరణ

సైబరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగుతోంది. నిర్దేశిత ప్రదేశాల్లో ఇప్పటివరకు 1,03,000కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు.

నిమజ్జన ప్రదేశాల్లో ఫీల్డ్ బృందాలు, యంత్రాలను మోహరించారు. పూల వ్యర్థాలు, ప్లాస్టిక్ వేరుచేసి సేకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిని కంపోస్టింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు.

జలాశయాల కాలుష్యాన్ని తగ్గించేందుకు మట్టి విగ్రహాలను, కృత్రిమ కొలనులను ప్రోత్సహిస్తున్నామని అధికారులు చెప్పారు.