బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ఉరుములు వచ్చినప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.