సంగారెడ్డి జిల్లాలో గణేశ్ నిమజ్జనం విషాదంగా మారింది. పెద్ద కంజర్ల గ్రామంలోని నెరుడుచెర్ల చెరువులో విగ్రహ నిమజ్జనానికి వెళ్లిన అనాథాశ్రమ విద్యార్థుల్లో ఆరుగురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు విద్యార్థులను స్థానికులు రక్షించారు.
పోలీసులు మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేశారు. నిమజ్జనం వద్ద భద్రతా ఏర్పాట్లు, ఆశ్రమ నిర్వాహకుల బాధ్యతపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ ఘటనపై పలువురు నేతలు సంతాపం తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద తప్పనిసరిగా గజ ఈతగాళ్లు, పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.