గణేశ్ ఉత్సవాల్లో శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించిన మండపాలపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అనుమతించిన స్థాయిని మించి శబ్దం చేస్తున్న డీజే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
బాల్కొండలో రాత్రి వేళ అధిక శబ్దంతో వాహనం నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఓ యువకుడి మోటార్‌బైక్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు.
వృద్ధులు, రోగులు, విద్యార్థుల దృష్ట్యా రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడవద్దని పోలీసులు హెచ్చరించారు.