ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలు, అలజడి సముద్రం.. కాకినాడ రెండు పోర్టుల్లో కార్గో కార్యకలాపాలు నిలిపివేత, ఒడిశాలో 51 ఏపీ బోట్లు

భారీ వర్షాలు, సముద్రం అలజడిగా ఉండటంతో కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టుల్లో కార్గో కార్యకలాపాలను నిలిపివేశారు. ఏపీకి చెందిన 51 మత్స్యకార బోట్లు ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్టులో ఆశ్రయం పొందాయి.

షేర్ చేయండిWhatsAppTelegram
భారీ వర్షాలు, అలజడి సముద్రం.. కాకినాడ రెండు పోర్టుల్లో కార్గో కార్యకలాపాలు నిలిపివేత, ఒడిశాలో 51 ఏపీ బోట్లు

వాతావరణం అనుకూలించకపోవడంతో కాకినాడ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టుల్లో కార్గో లోడింగ్, అన్‌లోడింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 మత్స్యకార బోట్లు ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్టులో ఆశ్రయం పొందాయి. వాటి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, వాతావరణ హెచ్చరికలను పాటించాలని అధికారులు సూచించారు.