ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్టోబర్ 1న 61.80 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందనున్నాయి.
వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేందుకు వీలుగా ఉదయమే నగదు అందుబాటులో ఉంచాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది.
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సహా వివిధ కేటగిరీల లబ్ధిదారులకు ఈ పింఛన్లు అందుతాయి.