ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పలు దేశాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
ద్వైపాక్షిక సంబంధాలు, బహుపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రత, ఉక్రెయిన్ సంక్షోభం, ఆర్థిక-ఇంధన-ఆహార భద్రత వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.
మరోవైపు ఉగ్రవాద సంబంధాలపై విలేకరుల ప్రశ్నలకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమాధానం దాటవేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై ఐరాస వేదికగా భారత్ పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.