పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బలూచిస్థాన్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో పలువురు అఫ్గాన్ తాలిబన్ ఫైటర్లు మరణించారని పాకిస్థాన్ భద్రతా బలగాలు ప్రకటించాయి.
సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించడంతోనే కాల్పులు జరిపామని పాక్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక, డ్రోన్ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.
రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తరచూ ఘర్షణలకు దారితీస్తున్నాయి.