జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. 48 ఏళ్ల అంగన్‌వాడీ కార్యకర్త కుటుంబ కలహాల కారణంగా భర్త చేతిలో హత్యకు గురయ్యారు. గొంతు నులిమి చంపాడని ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఖమ్మం జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఓ వ్యక్తి ఎన్ఎస్పీ కాలువలో దూకగా, ఆయన భార్య ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పాఠశాల విద్యార్థులు అనాథలయ్యారు. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు 14416 టెలి-మానస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.