తెలంగాణ

వన్యప్రాణుల కోసం పొలాల్లో అమర్చిన విద్యుత్ తీగలు.. లారీ క్లీనర్ మృతి, అటవీ శాఖ హెచ్చరిక

వన్యప్రాణులను అడ్డుకోవడానికి రైతులు అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ లారీ క్లీనర్ మృతి చెందారు. అటవీ ప్రాంతాల్లో ఇలాంటి కనెక్షన్లపై నిఘా పెట్టామని అటవీ అధికారులు తెలిపారు.

షేర్ చేయండిWhatsAppTelegram
వన్యప్రాణుల కోసం పొలాల్లో అమర్చిన విద్యుత్ తీగలు.. లారీ క్లీనర్ మృతి, అటవీ శాఖ హెచ్చరిక

పంటలను వన్యప్రాణుల నుంచి కాపాడుకోవడానికి పొలాల చుట్టూ అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగలు మరో ప్రాణం తీశాయి. తీగలు తగిలి ఓ లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు.

వేటగాళ్లు, కొందరు రైతులు అడవి అంచుల్లో ఇలాంటి కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారని, వాటిపై నిరంతరం నిఘా పెడుతున్నామని అటవీ అధికారులు తెలిపారు. అక్రమ కనెక్షన్లు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని ఇస్లాంపూర్ తండాలో గుర్తు తెలియని వన్యప్రాణి దాడిలో ఓ లేగదూడ మృతి చెందింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది.