టెక్నాలజీ

పంటల పర్యవేక్షణకు ఏఐ.. ఉపగ్రహ చిత్రాలతో దిగుబడి అంచనా వేసే ‘సికిల్’ డేటాసెట్ అభివృద్ధి

ఐఐఐటీ-ఢిల్లీ, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిసి ‘సికిల్’ పేరుతో ఏఐ డేటాసెట్ రూపొందించాయి. 21 రకాల పంటల్లో 388 ప్లాట్లకు సంబంధించిన 2.09 లక్షల ఉపగ్రహ చిత్రాలతో దిగుబడిని అంచనా వేస్తుంది.

షేర్ చేయండిWhatsAppTelegram
పంటల పర్యవేక్షణకు ఏఐ.. ఉపగ్రహ చిత్రాలతో దిగుబడి అంచనా వేసే ‘సికిల్’ డేటాసెట్ అభివృద్ధి

వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ వినియోగానికి కొత్త మార్గం తెరుచుకుంది. ఐఐఐటీ-ఢిల్లీ, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘సికిల్’ పేరుతో బహుళ ఉపగ్రహ డేటాసెట్‌ను అభివృద్ధి చేశాయి.

ఇందులో 21 రకాల పంటలకు సంబంధించిన 388 ప్లాట్ల నుంచి సేకరించిన సుమారు 2,09,000 ఉపగ్రహ చిత్రాలు, క్షేత్రస్థాయి సమాచారం ఉన్నాయి. ఈ ఏఐ వ్యవస్థ పంటను గుర్తించి, ఎదుగుదల దశలను ట్రాక్ చేసి, దిగుబడిని ముందుగానే అంచనా వేస్తుంది.

ఇలాంటి సాంకేతికత తెలుగు రాష్ట్రాల్లోనూ అమలైతే పంట బీమా, నష్ట అంచనా, మార్కెట్ ప్రణాళికలో రైతులకు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.