గణేశ్ నిమజ్జన ఊరేగింపుల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలపై పోలీసులు కఠినంగా ఉంటామని హెచ్చరించారు. అశ్లీల, రెచ్చగొట్టే పాటలు ప్లే చేసేవారిపై చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియా మానిటరింగ్ బృందాలు ఊరేగింపుల వీడియోలను పరిశీలిస్తున్నాయని, ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.
నిర్వాహకులు అనుమతించిన మార్గంలోనే ఊరేగింపు నిర్వహించాలని, శబ్ద పరిమితులు పాటించాలని పోలీసులు కోరారు.