సెమీకండక్టర్ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. జపాన్‌కు చెందిన హిరాటా కార్పొరేషన్ నగరానికి చెందిన ఏటీఎస్ ఇండియాతో భాగస్వామ్యం ప్రకటించింది. సెమీకండక్టర్ బ్యాక్‌ఎండ్ పరికరాలు, ఆటోమేషన్ సాంకేతికతను భారత మార్కెట్‌కు అందించడం ఈ ఒప్పందం లక్ష్యం.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు సింగపూర్ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో సెమీకండక్టర్, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అవకాశాలను వివరించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని సింగపూర్ కంపెనీలను మంత్రి కోరారు.