ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లాలో బోల్తా పడిన స్కూల్ బస్సు.. ఒకరు మృతి, 30 మంది విద్యార్థులకు గాయాలు

ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్తున్న స్కూల్ బస్సు ఆటోను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 30 మంది విద్యార్థులు గాయపడ్డారు.

షేర్ చేయండిWhatsAppTelegram
ఏలూరు జిల్లాలో బోల్తా పడిన స్కూల్ బస్సు.. ఒకరు మృతి, 30 మంది విద్యార్థులకు గాయాలు

ఏలూరు జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిరిపల్లి నుంచి నూజివీడు వైపు వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

ముందు వెళ్తున్న ఆటోరిక్షాను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనలో ఒకరు మృతి చెందగా 30 మంది విద్యార్థులు గాయపడ్డారు.

క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ బస్సుల వేగ నియంత్రణ, డ్రైవర్ల అర్హతలపై తనిఖీలు నిర్వహిస్తామని రవాణా శాఖ తెలిపింది.