ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావం నుంచి కోలుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
పంట నష్టం అంచనా సర్వేను వేగవంతం చేయాలని, దెబ్బతిన్న విద్యుత్ లైన్లను వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. విద్యుత్ మౌలిక వసతులకు రూ.2.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.
ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.