రాజమహేంద్రవరంలో సంచలనం రేపిన నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కారులో బ్యాగుల్లో ఉంచిన రూ.1.99 కోట్ల నగదును నిందితుడి నుంచి రికవరీ చేశారు.
తన కారులోంచి డబ్బు చోరీ అయిందంటూ కందుల సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇంత మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.