ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 83 ఇళ్లు దెబ్బతినగా, 152 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
సుమారు 630 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక వసతులకు రూ.2.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మిగిలిన ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
సహాయక చర్యలను వేగవంతం చేయాలని, పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.