కరవుకు మారుపేరుగా నిలిచిన రాయలసీమ రూపురేఖలు మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి ఫ్రూట్ బౌల్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఉద్యాన పంటల విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, ఎగుమతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మామిడి, బొప్పాయి, దానిమ్మ, అరటి వంటి పంటలపై దృష్టి పెట్టనున్నారు.
తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించడం ద్వారా కరవు ప్రభావాన్ని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.