తెలంగాణ 2029 నాటికి 5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకోవడం, ప్రముఖ సంస్థలు ఏఐ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో హైదరాబాద్‌లో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి.
- పైథాన్ ప్రోగ్రామింగ్ – ఏఐ, డేటా సైన్స్‌కు ప్రాథమిక పునాది.
- డేటా అనాలిసిస్ – ఎస్‌క్యూఎల్, పాండాస్, విజువలైజేషన్ టూల్స్.
- మెషిన్ లెర్నింగ్ ప్రాథమికాలు – మోడల్ ట్రైనింగ్, ఎవాల్యుయేషన్.
- క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లు – ఏడబ్ల్యూఎస్, అజూర్ సర్టిఫికేషన్లు.
- ప్రాంప్ట్ ఇంజినీరింగ్ – ఏఐ టూల్స్‌ను సమర్థంగా వాడే నైపుణ్యం.
- కమ్యూనికేషన్ – సాంకేతిక అంశాలను సులభంగా వివరించగలగడం.
ఉచిత ఆన్‌లైన్ కోర్సులు, ప్రాజెక్టు ఆధారిత శిక్షణతో ఫ్రెషర్లు కూడా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చని నిపుణులు చెబుతున్నారు.