ప్రతిపక్ష రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ‘ఇండియా’ కూటమిలో భాగం కాదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.
కూటమి నుంచి వైదొలిగిన తర్వాత ప్రతిపక్ష సమావేశాలకు హాజరు కాబోమని ఆయన ప్రకటించారు. అయితే ఎన్నికల సంఘం నాయకత్వంపై చేపట్టే చర్యలకు మాత్రం మద్దతు ఇస్తామని తెలిపారు.
ఈ నిర్ణయంతో ప్రతిపక్ష కూటమి సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.