ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం (ఏసీఏ) మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే దిశగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు మంగళగిరి స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు.
రాష్ట్రంలోని యువ మహిళా క్రికెటర్లకు ఈ లీగ్ వేదికగా నిలుస్తుందని, జాతీయ స్థాయి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు.
మ్యాచ్‌లకు ప్రవేశం ఉచితమని, క్రీడాభిమానులు హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించాలని ఏసీఏ కోరింది.