హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో కీలక సంస్థ అయిన రఘు వంశీ గ్రూప్ కొత్త నియామకాన్ని ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రూప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పదవికి అమిత్ పాఠక్‌ను నియమించింది.
ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలో 27 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన సంస్థ వాణిజ్య వ్యూహాన్ని నడిపిస్తారు.
హైదరాబాద్ ఏరోస్పేస్ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ఇంజినీర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి.