అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు కాఫీపై కీలక ప్రకటన చేశారు. అరకును ప్రపంచస్థాయి కాఫీ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
అరకు కాఫీ బ్రాండ్‌ను అంతర్జాతీయ మార్కెట్లో మరింత బలోపేతం చేయడం ద్వారా గిరిజన రైతుల ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
సేంద్రియ పద్ధతిలో పండించే అరకు కాఫీకి ఐరోపా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఎగుమతి సదుపాయాలను విస్తరించనున్నారు.