మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అభిషేక్ కుమార్‌ను దుబాయ్ నుంచి రాగానే హైదరాబాద్ విమానాశ్రయంలో సీబీఐ అరెస్ట్ చేసింది.
రాయ్‌పూర్ కోర్టు అతన్ని రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. యాప్ ద్వారా జరిగిన లావాదేవీలు, హవాలా మార్గాలపై విచారణ జరుగుతోంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, వాటికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.