ఆంధ్రప్రదేశ్

వివేకా హత్య కేసులో ఇద్దరు నిందితులకు ఈడీ నోటీసులు.. తొమ్మిది గంటల విచారణ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధమున్న ఇద్దరు నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఒక నిందితుడిని సుమారు తొమ్మిది గంటల పాటు విచారించి మళ్లీ హాజరుకావాలని ఆదేశించింది.

షేర్ చేయండిWhatsAppTelegram
వివేకా హత్య కేసులో ఇద్దరు నిందితులకు ఈడీ నోటీసులు.. తొమ్మిది గంటల విచారణ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ముమ్మరం చేసింది. కేసుతో సంబంధమున్న ఇద్దరు నిందితులకు నోటీసులు జారీ చేసింది.

ఒక నిందితుడిని సుమారు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించి, మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కేసు విచారణ న్యాయస్థానంలోనూ నడుస్తోంది.