తెలంగాణ శాసనసభలో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పంటల వైవిధ్యం తక్కువగా ఉందని ప్రస్తావించారు. వరి సాగు పెరిగి కూరగాయల సాగు తగ్గడంతో రాష్ట్రం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు.
కూరగాయలు, పండ్ల సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు, జిల్లాకో కోల్డ్ స్టోరేజీ యూనిట్, రైతు అవగాహన కార్యక్రమాలు అవసరమని వారు కోరారు.
పంటల వైవిధ్యానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వ్యవసాయ శాఖ స్పందించింది.