ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆదివాసీల ఆందోళన ఉధృతమైంది. లంబాడీలను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో వేలాది మంది ఆదివాసీలు ఐటీడీఏ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
ఐటీడీఏను పునరుజ్జీవింపజేయాలని, ఆదివాసీ హక్కులను రక్షించాలని నిరసనకారులు కోరారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆందోళన శాంతియుతంగా సాగింది.
ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి చర్చలకు రావాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి.