రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిర్వహణ, రహదారి మరియు రైల్వే భద్రత కోసం టీజీ-టీమార్స్ పేరుతో ప్రత్యేక పోలీసు బ్యూరోను ఏర్పాటు చేసింది.
ట్రాఫిక్ నిబంధనల అమలు, జాతీయ రహదారులపై పెట్రోలింగ్, ప్రమాదాల శాస్త్రీయ దర్యాప్తు ఈ బ్యూరో పరిధిలోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానంతో ట్రాఫిక్ అమలు జరుగుతుంది.
ప్రమాద కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి బ్లాక్ స్పాట్‌లను సరిచేయడం ద్వారా మరణాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.