తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సుమారు 29,000 ఫారం-7 దరఖాస్తులు అందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఫారం-7 అంటే ఓటరు జాబితా నుంచి ఒక పేరును తొలగించాలని కోరే దరఖాస్తు. మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లినవారు, డూప్లికేట్ ఎంట్రీల కోసం దీన్ని ఉపయోగిస్తారు.
మరోవైపు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు జాబితా తయారీ షెడ్యూల్‌ను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది.