అంతర్జాతీయ వార్తలు

సిరియాలో ప్రయాణికుల బస్సుపై కాల్పులు.. ఏడుగురు మృతి

వాయవ్య సిరియాలో ఓ మినీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు.

షేర్ చేయండిWhatsAppTelegram
సిరియాలో ప్రయాణికుల బస్సుపై కాల్పులు.. ఏడుగురు మృతి

వాయవ్య సిరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కంపెనీ ఉద్యోగులను తీసుకువెళ్తున్న మినీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.

ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. దాడికి ఇప్పటివరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు.

సిరియాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అభద్రత కొనసాగుతోంది. స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.