కేంద్ర ప్రభుత్వం 1934 నాటి పెట్రోలియం చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. లైసెన్స్ లేకుండా పెట్రోలియం కార్యకలాపాలు నిర్వహిస్తే రూ.25 కోట్ల వరకు పౌర జరిమానాలు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి.
చిన్నపాటి ఉల్లంఘనలను నేరరహితం (డీక్రిమినలైజ్) చేస్తూనే, తీవ్రమైన ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని బలోపేతం చేయడం ఈ సవరణల లక్ష్యం.
వ్యాపార సౌలభ్యం పెంచడంతో పాటు భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడమే ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి.