ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. నెల్లూరు జిల్లాలో పూర్తిగా ఆధునికీకరించిన రెండు ప్రభుత్వ పాఠశాలలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
ఈ పాఠశాలల్లో ఆధునిక తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ బోధన సౌకర్యాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా మరిన్ని పాఠశాలలను ఇదే విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.