భారతీయ టెలివిజన్, ఓటీటీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన ‘కాఫీ విత్ కరణ్’ షో ముగియనుంది. 22 ఏళ్ల ప్రయాణం తర్వాత ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు దర్శక-నిర్మాత కరణ్ జోహర్ ప్రకటించారు.
అక్టోబర్ 14 నుంచి జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న తొమ్మిదో సీజన్‌తో షో ముగుస్తుంది. 2004లో ప్రారంభమైన ఈ షో మొత్తం 161 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.
సినీ తారల వ్యక్తిగత జీవితం, పరిశ్రమ వివాదాలపై ఈ షో తరచూ చర్చనీయాంశంగా నిలిచింది.