ప్రాథమిక మార్కెట్‌లో మరో ఐపీఓ రానుంది. ఎక్కా ఎలక్ట్రానిక్స్ రూ.725 కోట్ల ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది.
ఇందులో రూ.525 కోట్ల విలువైన తాజా షేర్ల జారీ, రూ.200 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. సమీకరించిన నిధులను అప్పుల చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగిస్తారు.
ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థిక పరిస్థితి, రిస్క్ అంశాలను ముసాయిదా పత్రంలో చదవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.