హిందీ చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన సీనియర్ నటుడు ముస్తాక్ ఖాన్ కన్నుమూశారు.
ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను నటుడు అనుపమ్ ఖేర్ గుర్తు చేసుకున్నారు. ముస్తాక్ ఖాన్ ఎప్పుడూ హాస్యంగా, నిరాడంబరంగా ఉండేవారని ఆయన పేర్కొన్నారు.
ముస్తాక్ ఖాన్ కుమారుడు మొహసిన్, కుటుంబ సభ్యులకు అనుపమ్ ఖేర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.