తిరుపతి, సెప్టెంబర్ 18: తిరుపతిలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి చేసిన హల్‌చల్‌తో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైలు పైకెక్కిన అతడు హైటెన్షన్ విద్యుత్ వైర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
తిరువనంతపురం–న్యూఢిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన సదరు వ్యక్తి ప్లాట్‌ఫాంపై కేకలు వేస్తూ రైలు పైకి ఎక్కాడు. అనంతరం రైలు పైభాగంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్‌ను అందుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని అతడిని కిందకు దించేందుకు చర్యలు చేపట్టారు.
దాదాపు గంటపాటు శ్రమించిన సిబ్బంది చివరకు అతడిని సురక్షితంగా రైలు నుంచి కిందకు దించారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది. ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.