హైదరాబాద్, జనవరి 30: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌పై విచారణ మొదలైంది. BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు BJP నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారిస్తున్నారు.
దానం నాగేందర్‌పై disqualification చర్యలు తీసుకోవాలని ఈ ఇద్దరు నేతలు కోరారు. ఈ పిటిషన్ల నేపథ్యంలో వారి వాదనలను దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు cross-examination చేయనున్నారు.
అయితే, తాను ఇప్పటికీ BRS పార్టీకే చెందిన ఎమ్మెల్యేనని దానం నాగేందర్ ఇప్పటికే counter affidavit దాఖలు చేసి తన వాదనను స్పష్టం చేశారు. కేసు విచారణపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.